Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మునగాల ప్రజావాణికి 6 దరఖాస్తులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 08:49 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత అల్పాహారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భువనగిరి ఫోర్ట్‌ ఆధ్వర్యంలో ప్రారంభం.

28-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, సెప్టెంబర్‌ 28: ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకులకు ఉచితంగా అల్పాహారం అందించేందుకు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భువనగిరి ఫోర్ట్‌ ముందుకొచ్చింది. శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయ సహకారంతో ప్రతిరోజూ అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

సోమవారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఆలయ ప్రధాన అర్చకులు మాన్య శ్రావణాచార్యులు, వారి శిష్యబృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌, భువనగిరి ఫోర్ట్‌ క్లబ్‌ అధ్యక్షుడు రంగ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కొడితల నవీన్‌ తదితరులు అల్పాహార వితరణను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రంగ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఆస్పత్రి ఆవరణలో అల్పాహారం పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి సహకరిస్తున్న స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్వాహకులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో లయన్‌ కేవీ ప్రసాద్‌, ఐపీడీజీ లయన్‌ మదన్‌మోహన్‌, డిస్ట్రిక్ట్‌ జీఎస్‌టీ కోఆర్డినేటర్‌ లయన్‌ రవీందర్‌రావు బాచుపల్లి, లయన్‌ నువ్వుల సిద్ధప్ప, లయన్స్‌ క్లబ్‌ భువనగిరి ఫోర్ట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత అల్పాహారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భువనగిరి ఫోర్ట్‌ ఆధ్వర్యంలో ప్రారంభం.

Article Image

భువనగిరి, సెప్టెంబర్‌ 28: ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకులకు ఉచితంగా అల్పాహారం అందించేందుకు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భువనగిరి ఫోర్ట్‌ ముందుకొచ్చింది. శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయ సహకారంతో ప్రతిరోజూ అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

సోమవారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఆలయ ప్రధాన అర్చకులు మాన్య శ్రావణాచార్యులు, వారి శిష్యబృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌, భువనగిరి ఫోర్ట్‌ క్లబ్‌ అధ్యక్షుడు రంగ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కొడితల నవీన్‌ తదితరులు అల్పాహార వితరణను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రంగ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఆస్పత్రి ఆవరణలో అల్పాహారం పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి సహకరిస్తున్న స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్వాహకులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో లయన్‌ కేవీ ప్రసాద్‌, ఐపీడీజీ లయన్‌ మదన్‌మోహన్‌, డిస్ట్రిక్ట్‌ జీఎస్‌టీ కోఆర్డినేటర్‌ లయన్‌ రవీందర్‌రావు బాచుపల్లి, లయన్‌ నువ్వుల సిద్ధప్ప, లయన్స్‌ క్లబ్‌ భువనగిరి ఫోర్ట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News