బాలికలు తమ హక్కులను తెలుసుకుని విద్యలో రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ వ్యవస్థాపకురాలు,చైర్మన్ కాకర్ల సరస్వతి అన్నారు. యాడికి మండలం వేములపాడు గ్రామ సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని సంస్థ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థినులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల విద్య, హక్కులు, భద్రత, మంచి స్పర్శ–చెడు స్పర్శ, సైబర్ భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత, సమానత్వం, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి బాలిక తప్పనిసరిగా చదువుకోవాలని, చదువును మధ్యలో ఆపకుండా లక్ష్యాలను సాధించే వరకు కష్టపడాలని కాకర్ల సరస్వతి సూచించారు.తమ హక్కులకు ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన వ్యక్తులకు వెంటనే తెలియజేయాలని చెప్పారు. బాలికలు తమ శరీరంపై తమకే హక్కు ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు, మంచి స్పర్శ–చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించాలని సూచించారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు పంచుకోకుండా సైబర్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, మాసిక ధర్మ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ప్రతి బాలికలో ‘నేను చేయగలను, నేను సాధించగలను’ అనే ఆత్మవిశ్వాసం పెంపొందాలని, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాలికల భద్రత, అభివృద్ధి కోసం కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌జీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు, సందీప్, అడ్వకేట్ ఫరీదా, కర్ణ కుమార్, నాగబాబు, కేశవరావు, నబి రసూల్, నాగార్జున, కేశవ రెడ్డి, తులసి, పద్మజా, చిప్పర లక్ష్మి, లక్ష్మీదేవి తదితరులతో పాటు కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ప్రతి బాలిక చదువుకోవాలి.. ఎదగాలి.. సురక్షితంగా ఉండాలి:హెచ్‌ఆర్‌జీఎంఎస్ చైర్మన్ కాకర్ల సరస్వతి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి