Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ సంగీత నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 07:09 PM

పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా: నీలం మధు ముదిరాజ్

28-09-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆర్థిక ఇబ్బందులతో ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని చిట్కుల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని కానుకుంటకు చెందిన కుమ్మరి రామదాసుకు రూ.60 వేల, ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన అడపా ఎల్లమ్మకు రూ.60 వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ధైర్యాన్ని ఇస్తోందన్నారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ప్రభుత్వం ఈ నిధి ద్వారా ఆదుకుంటోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, మన్నే రాఘవేంద్ర, నారాయణదాసు, మణికంఠ, సర్పంచ్ కొరివి సురేష్, మాజీ ఉప సర్పంచ్ శోభకృష్ణ రెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాస్, వీరేష్, నర్సింలు, రాము, వెంకటేష్, బిక్షపతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా: నీలం మధు ముదిరాజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News