Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 09:00 PM

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ
18-02-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అమరావతిలో ఈ నెల 22న మహాసభ – బీసీల ఐక్యతే లక్ష్యం

తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారమే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలో బీసీ సింహ గర్జన నిర్వహించనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొడ్డు వెంకన్న యాదవ్ ప్రకటించారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న పూలే–అంబేద్కర్–మండల్–కర్పూరి ప్రాంగణంలో ఈ మహాసభ జరగనుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్లను స్థానిక జ్యోతిరావు ఫూలే భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్గదర్శకత్వంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అయినా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. బీసీలు సామాజిక వివక్షకు గురవుతున్నారని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో బీసీ కులాలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని కూడా కోరారు.

బీసీ సింహ గర్జన సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మురళి, సామాజికవేత్త డాక్టర్ రాజు, రాపోలు సత్యనారాయణ, కొండా రాంబాబు, సురేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బోయపల్లి రవీంద్ర గౌడ్, అనిల్ కుమార్ గౌడ్, దాసరాజు జయరాజ్ ముదిరాజ్, విద్యార్థి నాయకులు వేణుమాధవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News