Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:36 AM

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష

13-03-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముగ్గురికి జరిమానా విధించిన జిల్లా కోర్టు

అనంతపురం: జిల్లాలో సంచలనం సృష్టించిన బాలుడి హత్య కేసులో ముగ్గురికి జిల్లా కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే ముగ్గురికి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

అనంతపురం జిల్లా శెట్టూరు పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన క్రైమ్ నెంబర్.70/2022 కేసులో తిప్పనపల్లి గ్రామానికి చెందిన గొల్ల చిత్తప్ప, గొల్ల ఈరన్న, మురుకుందప్పలను దోషులుగా తేల్చిన జిల్లా జడ్జి ఈ.భీమారావు జీవిత ఖైదు శిక్ష విధించారు.

కేసు వివరాలు

శెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన సన్న ఈరన్న, చిత్తప్పలు అన్నదమ్ములు. వీరి మధ్య భూ తగాదాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 6న మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో సన్న ఈరన్న కుమారుడు విష్ణువర్ధన్ (11) తన చిన్నాన్న చిత్తప్ప తోటలోకి నీళ్లు తాగేందుకు వెళ్లాడు. అక్కడ మామిడిపండు, వేరుశనగ కాయలు తీసుకున్నాడని ప్రశ్నించగా “ఈ తోటలో నాకు కూడా హక్కు ఉంది” అని బాలుడు చెప్పడంతో చిత్తప్ప ఆగ్రహానికి గురయ్యాడు.

ఈ క్రమంలో చిత్తప్పతో పాటు బాలుడి తాత గొల్ల ఈరన్న, మామ మురుకుందప్ప కలిసి బాలుడిపై దాడి చేసి తాడుతో మెడ బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని టార్పాలిన్‌లో చుట్టి గడ్డివాములో దాచిపెట్టారు.

బాలుడి తండ్రి సన్న ఈరన్న ఫిర్యాదు మేరకు శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్సై యువరాజు కేసు నమోదు చేయగా, కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు విధించిన శిక్షలు

విచారణ అనంతరం కోర్టు ముగ్గురిని దోషులుగా తేల్చి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే

గొల్ల చిత్తప్పకు రూ.25,000

గొల్ల ఈరన్నకు రూ.50,000

మురుకుందప్పకు రూ.10,000

జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరు పరచడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ లైజన్ అధికారి ఏఎస్ఐ వై.మారెన్న, జిల్లా కోర్టు ఏఎస్ఐ ఎస్.మల్లిరెడ్డి, కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు కృష్ణమోహన్, రామమోహన్, కుళ్లాయి స్వామిలను జిల్లా ఎస్పీ పి.జగదీష్ మరియు కళ్యాణదుర్గం డీఎస్పీ అభినందించారు.

Sthanikam

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News