Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

24-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారులు, వయోజన విద్య జిల్లా ఉపసంచాలకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి యం. సుధీర్తో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల పరిశీలన కోసం హైదరాబాద్లోని సంబంధిత శాఖలకు పంపాలని తీర్మానించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం మరియు జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపారు.

అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా “దివ్యాంజన్ సెక్షన్”ను ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా దివ్యాంగులకు అనుకూలమైన పుస్తకాలు, అధ్యయన వనరులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించారు.

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి ద్వారా చదువుపై ఆసక్తి పెంపొందించడం, ప్రజలకు జ్ఞాన వనరులను చేరువ చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సమావేశంలో పేర్కొన్నారు.

Sthanikam

బడ్జెట్ 2026–27కు ఆమోదం – జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News