Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ

22-02-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆయేషా మెరా కేసును మూసివేయడంపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసు ఎత్తివేత ద్వారా మహిళల రక్షణలో వ్యవస్థల వైఫల్యం బహిర్గతమైందని ఆయన ఆరోపించారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనలో ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదం ఆచరణలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో ప్రభుత్వ వైఖరిపై కూడా విమర్శలు చేశారు.

ఆధారాలు లేవనే కారణంతో కేసు మూసివేయడం ద్వారా మహిళల ప్రాణ, మాణాలకు భద్రత కల్పించలేమనే సందేశం వెలువడుతోందని హరినాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరమని అన్నారు.

నిందితులు పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. నిర్భయ, ఆయేషా వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పౌర సమాజం, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు కలిసి న్యాయపోరాటానికి సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మహిళలకు రక్షణ కల్పించేలా దోషులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

Sthanikam

ఆయేషా కేసు మూసివేత నేరస్తులకు కొమ్ముకాయడమే’ – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ విమర్శ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News