Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:41 AM

అవినీతి అధికారుల ఇంట కోట్ల రూపాయలు లోకాయుక్త దాడిలో కట్టల కొద్ది నగదు

16-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బెంగళూరు: అవినీతిపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్న కర్ణాటక లోకాయుక్త అధికారులు తాజాగా ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లపై నిర్వహించిన సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ దాడులు చేపట్టారు.కెఆర్ఈఐఎస్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌పై కేసు

కర్ణాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేషన్ (కెఆర్ఈఐఎస్) సూపరింటెండింగ్ ఇంజనీర్ హెచ్.ఎం. జనార్దన్‌పై బెంగళూరు రూరల్ లోకాయుక్త పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన ఆరు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. జనార్దన్ స్నేహితుడు సుజయ్ శెట్టి నివాసంలో సోదాలు చేయగా ఏకంగా రూ.1.70 కోట్ల నగదు లభించింది. నోట్ల కట్టలను లెక్కపెట్టేందుకు యంత్రాలు కూడా వేడెక్కేంతగా నగదు దొరికినట్లు అధికారులు తెలిపారు. రబ్బరు బ్యాండ్లు కట్టడంలోనే సిబ్బంది చేతులు అలసిపోయాయని సమాచారం.

పిడబ్లూడి చీఫ్ ఇంజనీర్ ఇంట్లో భారీ సోదాలు మరోవైపు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్లూడి) చీఫ్ ఇంజనీర్ పురుషోత్తం నివాసంలో కూడా భారీ దాడులు జరిగాయి. గురువారం ఉదయం బెంగళూరులోని పద్మనాభనగర్ ప్రాంతంలో ఉన్న ఆయన మూడు అంతస్తుల విలాసవంతమైన బంగ్లాకు 10 మందికి పైగా అధికారులు రెండు వాహనాల్లో చేరుకుని సుమారు ఐదారు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లక్షల రూపాయల నగదు, భారీగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే నిర్మించిన ఈ ఇంటికి అట్టహాసంగా గృహప్రవేశం నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. మొత్తం రూ.23 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

ఇప్పటివరకు జరిగిన సోదాల్లో నలుగురు అధికారులకు సంబంధించిన రూ.23 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లు లోకాయుక్త వర్గాలు వెల్లడించాయి. నగదు, బంగారం, స్థిరాస్తులు, విలువైన పత్రాలు వంటి ఆధారాలను సీజ్ చేసి విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ ఘటనతో పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొంది. అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకాయుక్త అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

అవినీతి అధికారుల ఇంట కోట్ల రూపాయలు లోకాయుక్త దాడిలో కట్టల కొద్ది నగదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News