Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

ఆసుపత్రుల పనితీరుపై మంత్రి కొలుసు పార్ధసారధి ఆగ్రహం.

ఆసుపత్రుల పనితీరుపై మంత్రి కొలుసు పార్ధసారధి ఆగ్రహం.

ఆసుపత్రుల పనితీరుపై మంత్రి కొలుసు పార్ధసారధి ఆగ్రహం.
February 18, 2026 07:52 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి – నెలరోజుల్లో మార్పు లేకపోతే కఠిన చర్యలు హెచ్చరిక

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవల దారుణ స్థితిపై రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన నివేదిక ఆధారంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆసుపత్రుల పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు.

నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యుల హాజరు సరిగా లేకపోవడం, రోగులకు తగిన సేవలు అందకపోవడం, పారిశుధ్యం, ఆహారం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని నివేదిక వెల్లడించిందన్నారు. మొత్తం పనితీరు కేవలం అరవై మూడు శాతం మాత్రమే సంతృప్తికరంగా ఉండడం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూపుతోందని వ్యాఖ్యానించారు.

జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనితీరు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు మెరుగ్గా ఉండగా, ఇక్కడ మాత్రం పరిస్థితి వెనుకబడిందని మండిపడ్డారు. ఒక నెలలోగా పరిస్థితి మారకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

వైద్యులు అందుబాటులో లేకపోవడం, సేవల కోసం లంచాలు కోరుతున్నారనే ఫిర్యాదులు వస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రోగులకు అవసరమైన మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, కొరత ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

ఆసుపత్రి పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, అందించే ఆహారం, ఇతర సౌకర్యాలపై ప్రతిరోజూ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రోగుల సేవల్లో పారదర్శకత కోసం పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని, నిఘా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

లంచాలు తీసుకోవడం నేరమని స్పష్టంగా ప్రకటిస్తూ హెచ్చరికలు ప్రదర్శించాలని, ప్రజలకు ఫిర్యాదు చేసే అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. తాను ఎప్పుడైనా ఆకస్మికంగా తనిఖీకి వస్తానని, అప్పటికీ పరిస్థితి మారకపోతే కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో వైద్యాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News