Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:39 AM

అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించండి! సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

31-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు లో కొవ్వు నిజం !నెయ్యి అబద్ధం అనేది తేల్చుకుంటానికి 11 నుంచి జరిగే రాష్ట్ర అసెంబ్లీకి రమ్మని జగన్ వర్గాన్ని సవాల్ చేయటాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను పక్కదారి పట్టించడానికి అధికార పక్షం సమాయత్తమవుతోందన్నారు.అభివృద్ధి జపం చేసే చంద్రబాబు దావోస్ కి వెళ్ళినా ఒక్క పరిశ్రమ రాలేదనిరాష్ట్రానికి ఒరిగింది శూన్యం అన్నారు. ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రానికి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నారని హరినాథ్ విమర్శించారు. ఆంధ్ర తెలంగాణ మధ్య గోదావరి కృష్ణ జలాల పంపకము ప్రాజెక్టులువిషయంలో వివాదాలు రెచ్చగొట్టి కేంద్రం సోద్యం చూస్తోందన్నారు. అమరావతి రాజధానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోగా గుర్తింపు ఇవ్వడానికి కూడా కొర్రీలు పెడుతోందని హరినాథ్. విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రాష్ట్రంపై 40 శాతం భారం వేసినా చంద్రబాబు గొంతు మూగబోయిందన్నారు. కార్మికులకు హక్కుల హరించి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చినమోడీమెప్పు కోసమే కార్మికుల పని గంటలు పెంచే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబుబిల్లు చేశారని హరినాథ్ విమర్శించారు. ప్రతిపక్షం బలహీనతలను సొమ్ము చేసుకుని 14వైద్య కళాశాలలను పి పి పీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయం కాదా? అని హరినాథ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను లూలూమాల్ లాంటి సంస్థలకు, రాందేవ్ బాబా లాంటి వారికి, పారిశ్రామికవేత్తలకు 99 పైసెలకు 40, 50 సంవత్సరాలకు పైగా కట్ట పెట్టే విధానాలను అసెంబ్లీలో అధికార పక్షం సమాధానం చెప్పేలానిలదీసే విధంగా ప్రతిపక్షం ఉండాల న్నారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించకుండా పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఏమిటని జగన్ మోహన్ రెడ్డిని హరినాథ్ ప్రశ్నించారు.

Sthanikam

అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించండి! సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News