Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

అర్హులైన పేదలందరికీ పింఛన్లు – కూటమి ప్రభుత్వం కట్టుబాటు.మాన్వి దేవేంద్రప్ప

31-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,

అర్హులైన పేదలందరికీ పింఛన్లు అందించే దిశగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తెలిపారు.ఆదోని నియోజకవర్గంలోని బలాదూర్, దిబ్బేణేకల్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో సాగుతోందన్నారు. రేపు ఒకటవ తేది సెలవు దినం కావడంతో లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు.

తెల్లవారుజాము నుంచే ఆదోని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయని, రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికి చంద్రబాబు దూరదృష్టితో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు.ప్రతి పేదవాడికి న్యాయం చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి ఇరవై నాలుగు రకాల పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.అనంతరం బలాదూర్ ఎల్లమ్మ దేవి రథోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

అర్హులైన పేదలందరికీ పింఛన్లు – కూటమి ప్రభుత్వం కట్టుబాటు.మాన్వి దేవేంద్రప్ప

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News