Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లు ఒకరోజు ముందే పంపిణీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

25-02-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సీఎం చంద్రబాబు నిర్ణయం – ఈనెల 28న పింఛన్లు అందజేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. ఈ నేపథ్యంలో పెన్షన్లను ఒకరోజు ముందుగానే, ఈనెల 28వ తేదీ శనివారం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.

పెన్షన్ అందుకోలేని లబ్ధిదారులకు మార్చి రెండవ తేదీన కూడా పంపిణీ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళంలో డయేరియా అంశంపై ఆందోళన

అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వ్యాప్తి అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలను డయేరియా వ్యాధి పట్ల అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. పరిశుభ్రత, శుద్ధజల సరఫరా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

Sthanikam

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లు ఒకరోజు ముందే పంపిణీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News