Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:38 AM

ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవాలంటే ? ఏం చేయాలో చెప్పిన షర్మిల..! పాదయాత్రపై సెటైర్లు

30-01-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్ర ప్రదేశ్ జనవరి 30(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షురాలిగా ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా తనకు ఆస్తులు ఇవ్వని అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించిన వైఎస్ షర్మిల (ys sharmila).. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరు కొనసాగించారు. కానీ కొంతకాలంగా జగన్ విషయంలో ఆరోపణలకు బ్రేక్ ఇచ్చిన వైఎస్ షర్మిల తిరిగి నిన్న ఆయన పాదయాత్రను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. పాదయాత్ర ఇప్పుడు ఎందుకని ప్రశ్నించిన షర్మిల.. అధికారం ఇస్తే ఏం చేశారని నిలదీశారు.

జగన్ పాదయాత్ర ఎందుకు ? అధికారం కోసమే కదా ఈ పాట్లు ? అధికారం ఇస్తే ఏం చేశారు ? వైఎస్సార్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదన్నారు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నారని,

అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మద్యనిషేధం అన్నారని, అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి , క్యాష్ పద్ధతిలో మద్య మాఫియా చేశారన్నారు

వేల ఏళ్ల నుంచి నిలబడ్డ రుషికొండను బోడి గుండు చేశారని షర్మిల ఆరోపించారు. అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదని, ఆ పార్టీ వాళ్ళకే అందుబాటులో లేదని విమర్శించారు. ఎన్నికలకి 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారన్నారు. అంతే తప్పిస్తే ఒకరోజు అయినా ప్రజల కోసం బయటకు వచ్చారా ? అని ప్రశ్నించారు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలి అంటే అధికారం ఇచ్చి చూడాలన్న అబ్రహం లింకన్ మాటల్ని గుర్తుచేశారు. జగన్ ని అధికారంలో చూశామని, ఆయనకు అధికారం సూట్ అవ్వలేదని తెలిపారు. జగన్ నేచర్ మారాలని, నైజం మారాలని,మార్పు రావాలని సూచించారు. జగన్ లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలన్నారు. అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో అన్నారు. అంతవరకు దేవుడు , ప్రజలు ఆశీర్వదించడన్నారు. ఏడాది న్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకన్నారు

Sthanikam

ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవాలంటే ? ఏం చేయాలో చెప్పిన షర్మిల..! పాదయాత్రపై సెటైర్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News