Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

అమరావతి లో జాతీయ న్యాయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి లో జాతీయ న్యాయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి లో జాతీయ న్యాయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
March 02, 2026 02:27 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి,: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో జాతీయ స్థాయి న్యాయ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ను కోరారు. రాజధానిలో అత్యున్నత ప్రమాణాలతో న్యాయ నగరాన్ని నిర్మిస్తున్నామని, దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆదివారం విజయవాడలో రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ సాదర స్వాగతం పలికారు.

సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో భాగంగా న్యాయ నగరంలో న్యాయస్థాన భవనాలతో పాటు న్యాయ శిక్షణ సంస్థ, న్యాయ సేవల ప్రాధికార సంస్థ, మధ్యవర్తిత్వ కేంద్రం, అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, న్యాయవాదుల మండలి వంటి అన్ని విభాగాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అవసరమైన భూముల కేటాయింపుతో పాటు సంపూర్ణ సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. సమాజంలో త్వరిత న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం కీలకమని పేర్కొన్న ఆయన, ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారమైతే పది వేల రూపాయలు, పరిష్కారం కాకపోయినా ప్రక్రియలో పాల్గొన్నందుకు మూడు వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. న్యాయం వేగంగా జరిగితేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిని నీలం–పచ్చ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని, వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములు అందించడం చారిత్రక ఘట్టమని కొనియాడారు. వికసిత భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉన్నత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News