Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

అక్రెడిటేషన్ పాలసీపై హైకోర్టు కఠిన ఆదేశాలు. ఏప్రిల్ 30 వరకు కార్డుల పొడిగింపు

అక్రెడిటేషన్ పాలసీపై హైకోర్టు కఠిన ఆదేశాలు. ఏప్రిల్ 30 వరకు కార్డుల పొడిగింపు

అక్రెడిటేషన్ పాలసీపై హైకోర్టు కఠిన ఆదేశాలు.  ఏప్రిల్ 30 వరకు కార్డుల పొడిగింపు
February 27, 2026 07:55 AM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అక్రెడిటేషన్ పాలసీపై రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల్లో చర్చ మళ్లీ ఉద్ధృతమైంది.

కేబుల్, డిజిటల్ మీడియా ప్రతినిధుల్లో అనిశ్చితి కొనసాగుతోంది.

ప్రభుత్వం ఏ విధమైన సమగ్ర కౌంటర్ దాఖలు చేస్తుందన్న దానిపై మీడియా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం…

తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రెడిటేషన్ అర్హతలకు సంబంధించి గత ఏడాది ప్రభుత్వం జారీ చేసిన జీఓపై దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం… పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్‌తో పాటు మీడియా అకాడమీ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.

ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారించింది. కేబుల్ చానళ్లు, డిజిటల్ మీడియాకు అక్రెడిటేషన్ జారీకి నిర్ణయించిన అర్హతలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. జీఓను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28తో ముగుస్తుందని న్యాయవాది తెలిపారు.

ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారా అని ధర్మాసనం ప్రశ్నించగా, ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ… ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును మరో రెండు నెలలు, అంటే ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. కౌంటర్ దాఖలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం అభ్యర్థించడంతో ధర్మాసనం నాలుగు వారాల సమయం ఇచ్చింది. అనంతరం రెండు వారాల్లో రిప్లై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 8కు వాయిదా వేసింది

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News