Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:08 PM

అక్రెడిటేషన్ జీఓపై అపోహలు వద్దు.. వృత్తిపర జర్నలిస్టులకు పూర్తి భరోసా

27-12-2025 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అక్రెడిటేషన్ మార్గదర్శకాలపై అపోహలు వద్దు – స్పష్టం చేసిన మీడియా అకాడమీ చైర్మన్

స్థానిక ప్రతినిధి హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం చేయవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టుల మధ్య ఏ విధమైన వివక్షత లేకుండా సంక్షేమ చర్యలు అందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమాన్ని మరింత మెరుగుపర్చే దిశగా ఆలోచిస్తున్నారని వెల్లడించారు. గతంలో ఉర్దూ జర్నలిస్టులపై జరిగిన వివక్ష, చిన్న పత్రికల పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలోనే ఈ కొత్త జీఓలో మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.

నూతన జీఓపై కొందరు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, సంక్షేమ చర్యలు కేవలం కొందరికే వర్తిస్తాయని వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

ఈ అంశాలపై అవసరమైతే స్పష్టత కోరవచ్చని, జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, దీనికి విరుద్ధంగా రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళనలు సృష్టించడం అత్యంత విచారకరమని వ్యాఖ్యానించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సానుకూలంగా ఉందని, గత ప్రభుత్వాల మాదిరిగా వివక్ష చూపే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నూతన జీఓపై పనిగట్టుకొని జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

అక్రెడిటేషన్ జీఓపై అపోహలు వద్దు.. వృత్తిపర జర్నలిస్టులకు పూర్తి భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News