Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:02 AM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు

12-02-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన స్విచ్ ఆఫ్ చేశాడన్న కథనం – అధికారిక నిర్ధారణ లేదు

న్యూఢిల్లీ

గత ఏడాది 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘కొర్రియేరే దెల్లా సేరా’ సంచలన ఆరోపణలు చేసింది. పైలట్లలో ఒకరు ఇంధన స్విచ్‌లను ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేసినట్టు తన కథనంలో పేర్కొంది.విమాన కమాండర్ సుమీత్ సభర్వాల్‌ను ప్రధాన అనుమానితుడిగా సూచించిన ఆ పత్రిక, విమానంలో స్పష్టమైన సాంకేతిక లోపాలు గుర్తించబడలేదని పేర్కొంది. పలు విమానయాన సంస్థల ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ వివరాలు వెలువరించినట్టు తెలిపింది.అయితే ఈ ఆరోపణలపై భారత అధికార వర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలన కొనసాగిస్తున్నాయి. అధికారిక తుది నివేదిక వెలువడిన తర్వాతే వాస్తవాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇటలీ పత్రిక ప్రచురించిన ఈ కథనం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విమాన ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత కోసం బాధిత కుటుంబాలు కూడా తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నాయి.

Sthanikam

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక సంచలన ఆరోపణలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News