Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

24-02-2026 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.26 వేల వేతనం అమలు చేయాలి

ఆదోని: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదోని మున్సిపల్ ప్రధాన రహదారిపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాన్ని రూ.26,000గా నిర్ణయించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

దీక్షా కార్యక్రమంలో అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు ఈరమ్మ, కోశాధికారి గీత ప్రభావతి, రాష్ట్ర, జిల్లా నాయకులు జానకి, గౌసియా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షుడు టి. వీరేష్, వర్కింగ్ అధ్యక్షుడు ఏ. విజయ్ కుమార్, సిపిఐ పట్టణ సహాయకార్యదర్శి కె. రమేష్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజి గౌడ్ హాజరై సంఘీభావం తెలిపారు.

Sthanikam

అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News