Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:49 AM

అధ్వాన్నంగా మున్సిపాలిటీ చెత్త డంపు యార్డ్

09-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Tirumalagiri
chintha ravi

ప్రజానీకం, రైతులకు అవస్థలు

తిరుమలగిరి స్థానికం ప్రతినిధి రవి

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని చెత్త డంపింగ్ యార్డ్ అధ్వాన్నంగా మారి ప్రజానీకం, రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. డంపింగ్ యార్డ్‌కు ప్రహరీ గోడ లేకపోవడంతో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా సంక్షేమ హాస్టళ్లకు అతి సమీపంలోనే డంపు యార్డ్ ఉండటంతో విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చెత్త నుంచి వెలువడే పొగ కారణంగా పరిసర ప్రాంతాల్లోని రైతులు సుమారు 20 నుంచి 50 ఎకరాల వరకు పంట నష్టపోతున్నారని తెలిపారు. అలాగే నీలిబండ తండాకు వెళ్లే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

డంపింగ్ యార్డ్ చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని, చెత్త నిర్వహణకు రీసైక్లింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

అధ్వాన్నంగా మున్సిపాలిటీ చెత్త డంపు యార్డ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News