Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:20 AM

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ
21-02-2026 480 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భూదానపోచంపల్లి, గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు.

భూదానపోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండో విడతగా నిర్వహించిన నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. బొమ్మలరామారం, అలేరు, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆదర్శ పంచాయతీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్యం, విద్యుద్దీపాలు, వైకుంఠధామాల అభివృద్ధి, హరితహారం అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పారదర్శక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్‌రెడ్డి, రాములు, టీబీటీలు భాస్కర్, నవీన్‌కుమార్, మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదర్శ గ్రామాల దిశగా సర్పంచులకు శిక్షణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News