Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ.. చెల్లికి కానుక అందించిన ఎంపీ షేట్కార్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:58 PM

అభివృద్ధి చేస్తే రండి లేదంటే అభ్యర్థులను తప్పించండి వీరేషానికి లింగయ్య సవాల్

06-02-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిట్యాల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు.

తాను గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో చిట్యాల పట్టణ అభివృద్ధికి చేసిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని లింగయ్య స్పష్టం చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే వీరేశం గెలిచిన తర్వాత రెండున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

చర్చకు సిద్ధమై కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి అభివృద్ధి అంశాలపై మాట్లాడితే, తాను బిఆర్ఎస్‌కు చెందిన 12 మంది మున్సిపల్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు సిద్ధమని లింగయ్య సంచలన ప్రకటన చేశారు. అదే విధంగా, ఎమ్మెల్యే వీరేశం చర్చకు రాకుండా అభివృద్ధి చేయలేదని తేలితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.

ఈ సవాలను స్వీకరిస్తే కనకదుర్గమ్మ ఆలయం వద్దకు వచ్చి అభివృద్ధిపై బహిరంగ చర్చ జరపాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు చిట్యాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుండగా, ఎమ్మెల్యే వీరేశం దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య అభివృద్ధి అంశమే ప్రధాన ఆయుధంగా మారుతుండటం గమనార్హం.

Sthanikam

అభివృద్ధి చేస్తే రండి లేదంటే అభ్యర్థులను తప్పించండి వీరేషానికి లింగయ్య సవాల్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News