Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతకు ‘ఎల్ఐసీ’యే కొండంత అండ: వాసవి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ విజయ్‌కుమార్ ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 07:38 PM

ఆత్మకూరు మండలంలో ఉలిక్కిపడ్డ ప్రజలు – గ్రామాల వైపు పెద్దపులి సంచారం

05-02-2026 647 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూరు మండలంలో పెద్దపులి సంచారం – పల్లెపహాడ్, పారుపల్లి గ్రామాల్లో భయాందోళన

ఆత్మకూరు మండలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అడవిని దాటి పెద్దపులి గ్రామాల వైపు చేరినట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించడంతో పల్లెపహాడ్, పారుపల్లి గ్రామాల్లో భయాందోళన నెలకొంది. సుమారు మూడు వందల కిలోల బరువున్న పెద్దపులి సంచరిస్తోందన్న సమాచారం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.పొలాలు, వ్యవసాయ బావులు, అటవీ సరిహద్దుల వద్ద పెద్దపులి కదలికలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు, గ్రామస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని, పశువులను బయట వదలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.గ్రామాల్లో అవసరం లేని సంచారం మానుకోవాలని, పిల్లలను బయటకు పంపవద్దని అటవీ శాఖ స్పష్టం చేసింది. పెద్దపులి ఆనవాళ్లు కనిపించినా, దర్శనమిచ్చినా వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఆత్మకూరు మండలంలో పెద్దపులి సంచారం… ప్రజల్లో ఆందోళన… గ్రామాలపై ముప్పు మేఘం కమ్ముకున్న వేళ అప్రమత్తతే రక్షణగా మారింది.

Sthanikam

ఆత్మకూరు మండలంలో ఉలిక్కిపడ్డ ప్రజలు – గ్రామాల వైపు పెద్దపులి సంచారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News