Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:28 PM

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి – 74వ రోజుకు చేరిన నిరాహార దీక్షలో సిపిఐ ఘాటు డిమాండ్

28-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

పశ్చిమ ప్రాంత అభివృద్ధిని కాలయాపన చేయొద్దని, వెంటనే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష 74వ రోజుకు చేరుకున్న సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దీక్షా శిబిరాన్ని సందర్శించి, శిబిరంలో కూర్చొని ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారుఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, రెండు నెలలకు పైగా శాంతియుతంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజా అవసరాలు, భౌగోళిక పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఆదోనిని జిల్లాగా ప్రకటించడంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు.ఆదోనికి జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఐదు నియోజకవర్గాలకు కేంద్రబిందువుగా ఉన్న భౌగోళిక స్థానం, రహదారి–రైల్వే రవాణా సౌకర్యాలు, తగిన ప్రజాసంఖ్య, ఇప్పటికే ఉన్న ఆర్డీఓ కార్యాలయాలు, రెవెన్యూ విభాగాలు, న్యాయస్థానాలు, విద్యా–వైద్య సంస్థలు పరిపాలనా మౌలిక వసతులకు నిదర్శనమన్నారు.

వ్యాపారం, పరిశ్రమలు, వ్యవసాయ మార్కెట్లతో ఆదోని ఆర్థికంగా నిలదొక్కుకున్న పట్టణమని, దీర్ఘ చరిత్ర కలిగిన సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల న్యాయమైన ఆకాంక్షగా కొనసాగుతున్న ఆదోని జిల్లా డిమాండ్‌ను ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వానికి సిపిఐ హెచ్చరిక

ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదోనిని జిల్లాగా ప్రకటించకపోతే, ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కే. రామాంజనేయులు, ఎస్. సుదర్శన్, ఆదోని పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, కే. రమేష్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజి గౌడ్, జేఏసీ నాయకులు కె. వెంకటేష్, పగడాలకు కోదండ, తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ఇప్పటికైనా గౌరవించి, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని సిపిఐ నాయకులు మరోసారి డిమాండ్ చేశారు.

Sthanikam

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి – 74వ రోజుకు చేరిన నిరాహార దీక్షలో సిపిఐ ఘాటు డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News