Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:31 AM

ఆదోనిలో సీపీఐ ఆధ్వర్యంలో ఉత్సాహభరిత బైక్ ర్యాలీ

14-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీపీఐ శతాబ్ది సభను జయప్రదం చేయాలి

ఆదోని, స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం నగరంలో నిర్వహించనున్న మహా బహిరంగ సభను, అలాగే జనవరి 16న ఆదోనిలో జరగనున్న పబ్లిక్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆదోనిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీకి సీపీఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు, పట్టణ సహాయ కార్యదర్శి యు.లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్ నాయకత్వం వహించారు.సీపీఐ సీనియర్ నాయకులు కే.అజయ్ బాబు, రైతు సంఘం నాయకులు బాసాపురం గోపాల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బుడ్డేకల్‌లోని సీపీఐ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గుల్షన్ షా దర్గా, హవన్నపేట, తిక్క స్వామి దర్గా, పోలీస్ కంట్రోల్ రూమ్, భీమాస్ సర్కిల్, శ్రీనివాస భవన్, ఏరియా హాస్పిటల్ రోడ్డుల మీదుగా సాగి తిరిగి సీపీఐ కార్యాలయం వద్ద ముగిసింది.

ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకుడు కే.అజయ్ బాబు మాట్లాడుతూ, వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచిందన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరగనున్న మహా బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ బైక్ ర్యాలీలో సీపీఐ డీహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు ఏ.విజయ్ కుమారస్వామి, నాగరాజు, రవి, వడ్డే రాము, పులి రాజు, గిడ్డయ్య, వంశీతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శతాబ్ది ఉత్సవాలకు మద్దతు ప్రకటించారు.

Sthanikam

ఆదోనిలో సీపీఐ ఆధ్వర్యంలో ఉత్సాహభరిత బైక్ ర్యాలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News