Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:14 AM

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
31-12-2025 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని స్థానికం ప్రతినిధి

ఆదోని పట్టణంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, ఆదోని టీడీపీ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు సూచనలతో, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉదయం ఆరు గంటల నుంచే ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డు, వెంకన్నపేట, కాంతి నగర్ తదితర ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. డిసెంబర్ నెలలో నియోజకవర్గానికి 29 కొత్త పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. కిడ్నీ డయాలసిస్‌తో బాధపడుతున్న నలుగురికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున పింఛన్ అందినట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా అమలవుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను నేలస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News