Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:36 AM

6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు

28-03-2026 245 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ప్రతినిధి:

రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.

జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన అర్హత పత్రాలను జతచేసి అప్లికేషన్‌ను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటికే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ రెండు సార్లు సమావేశమై జీఓ అమలు, విధి విధానాలపై చర్చించిందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తూ, అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కార్డులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Sthanikam

6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News