Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:14 PM

60 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సువర్ణ సమ్మేళనం

04-02-2026 212 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుజూర్‌నగర్, ఫిబ్రవరి 4:

1963–64 హెచ్‌ఎస్సీ బ్యాచ్‌కు చెందిన హుజూర్‌నగర్ జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు 60 ఏళ్ల విరామం తర్వాత కలుసుకుని సువర్ణ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం కోట లక్ష్మీనరసింహారావు తోటలో జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయత, స్మృతులు, ఆనందోత్సవాల మధ్య అపూర్వంగా సాగింది.

అమెరికాలో స్థిరపడి అనేక విజయాలు సాధించి, హుజూర్‌నగర్‌కు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చి ఇటీవల స్వదేశానికి వచ్చిన కన్నెగుండ్ల రామ్ నరసయ్య శుభ సందర్భంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, పాత జ్ఞాపకాలను తలచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

స్నేహితుల బాగోగులు తెలుసుకుంటూ, జ్ఞాపికగా సమూహ చిత్రాలు తీసుకుని పరస్పరం సన్మానాలు నిర్వహించారు. విద్యార్థి దశలోని అనుభవాలు, గురువుల జ్ఞాపకాలు, జీవిత ప్రయాణాల్లో ఎదురైన మలుపులు ఈ సమ్మేళనంలో చర్చకు వచ్చాయి. ఆరు దశాబ్దాల తర్వాత కూడా స్నేహ బంధాలు చెరిగిపోకుండా నిలిచిన తీరు అందరినీ కదిలించింది.

ఈ కార్యక్రమంలో ముత్తినేని వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వర్లు, ఒక్కవంతుల కోటేశ్వరరావు, కన్నెగుండ్ల రామ్ నరసయ్య, ఎంబీ దేవదానం, డేవిడ్ రాజ, అలుగుబెల్లి లక్ష్మారెడ్డి, అలుగుబెల్లి కృష్ణారెడ్డి, కోట సూర్యప్రకాశవ, ఆకుమడుపుల హనుమంతు, కుక్కడపు కాశయ్య, కర్నాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

60 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సువర్ణ సమ్మేళనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News