Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:24 PM

5 నెలల ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

03-02-2026 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ – జిల్లా ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి. నవీన్ కుమార్

యాదాద్రి-భువనగిరి, ఫిబ్రవరి 03 :

తెలంగాణ రాష్ట్ర ఎస్సి స్టడీ సర్కిల్స్ ద్వారా నిర్వహించనున్న 5 నెలల ఫౌండేషన్ కోర్సు కు సంబంధించి ఉచిత రెసిడెన్షియల్ మరియు పోటీ పరీక్షల శిక్షణ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి. నవీన్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బి, ఎస్సెస్సీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని యాదాద్రి–భువనగిరి జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.

ఎస్సి, ఎస్టీ, బిసి (బిసి-ఇ), మైనారిటీ, పిడబ్ల్యూడి వర్గాలకు చెందిన అభ్యర్థులు

ఆన్‌లైన్‌లో http://tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

స్టడీ సర్కిల్‌లో ప్రవేశాలు పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతాయని స్పష్టం చేశారు.

దరఖాస్తుల ఆఖరి తేదీ : 22-02-2026.

ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఫిబ్రవరి 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని,

మార్చి 1, 2026 (ఆదివారం) నాడు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు

నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్ష జరుగుతుందని తెలిపారు.

డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై, సంవత్సరానికి రూ.3 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు కింది పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

కుల ధృవీకరణ పత్రం

ఏప్రిల్ 1, 2025 తరువాత తీసిన ఆదాయం సర్టిఫికెట్

డిగ్రీ సర్టిఫికెట్

పదో తరగతి సర్టిఫికెట్ (వయస్సు నిర్ధారణకు)

ఆధార్ కార్డు

పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం

అంగవైకల్యం సర్టిఫికెట్ (వర్తించేవారికి మాత్రమే)

గమనిక : గతంలో స్టడీ సర్కిల్స్‌లో 5 నెలల కోచింగ్ పొందినవారు లేదా సివిల్ సర్వీసెస్ స్టేట్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన వారు అర్హులు కాదని తెలిపారు.

ఇతర వివరాలకు

9396621492 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Sthanikam

5 నెలల ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News