Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:08 PM

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్: 'నానో కన్వర్షన్స్' పుస్తక ఆవిష్కరణ

24-12-2025 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
శాస్త్రీయ దృక్పథం పెంపొందించే పుస్తకాలే సమాజానికి దిక్సూచి: డా. రియాజ్
మత విశ్వాసాల నుండి నాస్తికత్వం వైపు సాగిన ప్రయాణమే ఈ పుస్తకం: రచయిత రతన్ కుమార్
హైదరాబాద్, స్థానికం న్యూస్ :

సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని (Scientific Temper) పెంపొందించే పుస్తకాలు వచ్చినప్పుడే సమాజం ప్రగతి సాధిస్తుందని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. రియాజ్ అన్నారు. మంగళవారం 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా ప్రభుత్వ సిటీ కళాశాల భౌతిక శాస్త్ర సహాచార్యులు రతన్ కుమార్ (విశ్వగురు) రచించిన "నానో కన్వర్షన్స్: ఎ సైంటిఫిక్ జర్నీ టు ఎతీయిజం" (Nano Conversions: A Scientific Journey to Atheism) పుస్తకాన్ని డా. రియాజ్, బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ డా. యాకూబ్ గార్లతో కలిసి ఆవిష్కరించారు.

పుస్తక విశేషాలు:

ఈ సందర్భంగా రచయిత రతన్ కుమార్ పుస్తక నేపథ్యాన్ని వివరిస్తూ.. మత విశ్వాసాల నుండి నాస్తికత్వం వైపు తన ప్రయాణం ఎందుకు, ఎలా జరిగిందో ఈ పుస్తకంలో సవివరంగా పొందుపరిచినట్లు తెలిపారు. మతం నుండి నాస్తికత్వానికి మార్పు అనేది ఒక్కసారిగా కాకుండా, సైన్స్ సహాయంతో చిన్న చిన్న మార్పుల (నానో కన్వర్షన్స్) ద్వారా ఎలా సాధ్యపడుతుందో వివరించారు. నిరూపణ లేని విశ్వాసాల కంటే, సైన్స్ ను ఆధారంగా చేసుకుని ఎవరికి వారు కొత్త జీవన విధానాన్ని ఎలా రూపొందించుకోవచ్చో ఈ పుస్తకం ద్వారా తెలియజేశానని అన్నారు.

పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో ఆచార్య సుదర్శన్ రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రంథాలయ అధికారి డా. ఎస్. యాదగిరి, ప్రభుత్వ సిటీ కళాశాల లైబ్రేరియన్ డా. రవికుమార్ చేగొని, రాష్ట్ర కేంద్ర గ్రంథ పాలకులు శ్రీమతి రాణి, సిటీ కళాశాల ఆచార్యులు కోయి కోటేశ్వర రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (హయత్ నగర్) లైబ్రేరియన్ డా. ఆనందం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్: 'నానో కన్వర్షన్స్' పుస్తక ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News