Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 05:13 PM

23 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి – స్ఫూర్తిదాయకమైన శ్రీపతి ప్రయాణం

18-01-2026 247 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి రాష్ట్రం స్థానికం ప్రతినిధి :రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన యువతి సివిల్ జడ్జిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. కేవలం 23 ఏళ్ల వయసులోనే సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీపతి అసాధారణ ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది. ఆమె సాధించిన ఈ గొప్ప విజయాన్ని ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ స్వయంగా అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.శ్రీపతి జీవిత ప్రయాణం సులభమైనది కాదు. చదువు కోసం, ఉద్యోగ లక్ష్యం కోసం ఎన్నో ఆర్థిక, సామాజిక అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగింది. ముఖ్యంగా సివిల్ జడ్జి పరీక్షకు ముందు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు హృదయాన్ని తాకేలా ఉన్నాయి.పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు శ్రీపతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో వైద్యులు విశ్రాంతి తప్పనిసరి అని, పరీక్ష రాయడం ప్రమాదకరమని సూచించారు. అయినా తన జీవిత లక్ష్యాన్ని వదులుకోవద్దని నిర్ణయించుకున్న ఆమె అపార ధైర్యంతో ముందడుగు వేసింది. రెండు రోజుల పసికందును వెంట పెట్టుకొని తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షకు హాజరైంది.తల్లి బాధ్యతలతో పాటు పరీక్ష ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని, చివరికి ఉద్యోగానికి ఎంపికై అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. గిరిజన వర్గానికి చెందిన యువతికి ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, సమాజంలోని అనేక మందికి ఆశాజ్యోతి కూడా.శ్రీపతి విజయం కష్టం ఎంత ఉన్నా ధైర్యం, సంకల్పం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని మరోసారి నిరూపించింది.

Sthanikam

23 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి – స్ఫూర్తిదాయకమైన శ్రీపతి ప్రయాణం

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News