Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:33 AM

1999–2004 విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలి ‘పెన్షన్ దయ కాదు… రాజ్యాంగ హక్కు’ – మీర్జా షకీల్ బేగ్

1999–2004 విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలి ‘పెన్షన్ దయ కాదు… రాజ్యాంగ హక్కు’ – మీర్జా షకీల్ బేగ్

1999–2004 విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలి ‘పెన్షన్ దయ కాదు… రాజ్యాంగ హక్కు’ – మీర్జా షకీల్ బేగ్
February 11, 2026 11:59 AM 291 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: తెలంగాణ విద్యుత్ శాఖలో 1999 నుంచి 2004 మధ్య నియమితులైన ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ భువనగిరి డివిజన్ అధ్యక్షుడు మీర్జా షకీల్ బేగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక గుర్తింపు లేకుండానే 15–20 సంవత్సరాల పాటు ప్రమాదకర పరిస్థితుల్లో విద్యుత్ పనులు నిర్వహించినవారే ఈ విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లు. గుంటలు తవ్వడం, స్తంభాలు నాటడం, లైన్లు ఎక్కడం వంటి ప్రాణాపాయ పనులు చేస్తూ మారుమూల పల్లెలకు వెలుగులు నింపిన కార్మికులని ఆయన గుర్తు చేశారు. 2002 ప్రాంతంలో అధికారికంగా ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పటికీ, అప్పటికే 40–45 ఏళ్ల వయస్సులో ఉండటంతో తగిన సర్వీసు కాలం పూర్తికాక చాలామంది పెన్షన్ హక్కును కోల్పోయారని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పెన్షన్ అనేది దయ కాదు… అది రాజ్యాంగబద్ధ హక్కు” అని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ల ప్రకారం మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి చేసిన సేవలకు ఆలస్యంగా చెల్లించే వేతనం (Deferred Wages) అని పేర్కొన్నారు. ఒకే విధమైన పని చేసిన ఉద్యోగులను కేవలం నియామక తేదీ ఆధారంగా పెన్షన్ నుంచి దూరం చేయడం స్పష్టమైన వివక్ష అని విమర్శించారు.రిటైర్మెంట్ తరువాత దయనీయ పరిస్థితి2021 నుంచి రిటైర్ అవుతున్న ఈ ఉద్యోగులు నెలవారీ పెన్షన్ లేకుండా జీవనం సాగించాల్సి వస్తోంది. ఈపీఎఫ్ ద్వారా కేవలం సుమారు రూ.2,000 మాత్రమే అందుతుండటంతో వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా లేకుండా పోయిందని తెలిపారు. వైద్య భద్రత లేకపోవడం, మందులు–చికిత్స ఖర్చులు భరించలేని స్థితి, కుటుంబ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ప్రజలకు వెలుగులు నింపిన కార్మికులు నేడు తమ కుటుంబాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే సుమారు 400 మంది ఉద్యోగులు రిటైర్ కాగా, రాబోయే కాలంలో దాదాపు 2,500 మంది రిటైర్ కావాల్సి ఉందని, వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని అన్నారు.

ప్రభుత్వానికి డిమాండ్లు

1999–2004 మధ్య నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం లేదా ప్రత్యేక పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి.

ఇప్పటికే రిటైర్ అయిన వారికి కనీస సామాజిక భద్రత కల్పించాలి.రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు / ఆరోగ్య బీమా అందించాలి.

గ్రామాలకు వెలుగులు నింపిన కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపడం ప్రభుత్వ ధర్మం, సామాజిక న్యాయం, రాజ్యాంగ బాధ్యత అని మీర్జా షకీల్ బేగ్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News