Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన

23-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సికింద్రాబాద్‌లో 19వ విడత కార్యక్రమం.

218 మందికి నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు సాధికారత కల్పించడమే ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహించిన 19వ విడత రోజ్‌గార్ మేళాలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ఆరు శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 218 మంది యువతీయువకులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. 2022 నుంచి నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

దేశ యువత ఇప్పుడు ఉద్యోగార్థులుగానే కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా కూడా ఎదుగుతున్నారని ఆయన అన్నారు. అంకుర సంస్థలు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా తయారీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని, తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి అండగా నిలవాలని మంత్రి సూచించారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు.కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, డీఆర్‌ఎం డాక్టర్ ఆర్‌. గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతకు ఉద్యోగాలతో పాటు సాధికారత రోజ్‌గార్ మేళాతో కేంద్రం భారీ ఉపాధి కల్పన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News