Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

యువతకు క్రీడలే లక్ష్యంగా యువ సర్పంచ్ ముందడుగు.సాయికుమార్ గౌడ్

12-01-2026 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో యువతను క్రీడల వైపు మళ్లించే దిశగా గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువత, మహిళలకు ఉత్సాహాన్ని నింపేలా పలు క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.మహిళల కోసం సంక్రాంతి ముగ్గుల పోటీలు, యువత కోసం క్రికెట్ టోర్నమెంట్‌ను పూర్తిగా తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాక గ్రామ యువతకు క్రీడలకు అనువుగా గ్రౌండ్‌ను శుభ్రపరచి అవసరమైన ఏర్పాట్లు చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని, శారీరక దృఢత్వం, క్రమశిక్షణతోనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలమని అన్నారు. గ్రామ యువత ఇతరులకు ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.గ్రామాభివృద్ధితో పాటు యువత శక్తిని సానుకూల దిశగా మళ్లించే ఇలాంటి ప్రయత్నాలు ప్రశంసనీయం అంటూ గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Sthanikam

యువతకు క్రీడలే లక్ష్యంగా యువ సర్పంచ్ ముందడుగు.సాయికుమార్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News