Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:41 PM

యాసంగిలో రైతుకు భరోసా లేదు. షాపుల్లో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా?

27-01-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సన్న వరికి బోనస్ వెంటనే అమలు చేయాలి: రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

నల్లగొండ జిల్లా:స్థానికం ప్రధాన ప్రతినిధి

యాసంగి సీజన్ ప్రారంభమై వరి నాట్లు పూర్తయినా రైతులకు ఇప్పటికీ రైతు భరోసా అందకపోవడంతో రైతాంగం తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టబడిందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.సిరిపురం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వరి నాట్లు ముగిసి పది రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ కాలేదన్నారు. కూలీల ఖర్చులు, ట్రాక్టర్ దున్నకం, ఎరువులు, మందుల కోసం చేతిలో డబ్బులు లేక రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సంక్రాంతికి రైతు భరోసా వేస్తామని చెప్పిన ప్రభుత్వం, పండగ ముగిసి పది రోజులు గడిచినా హామీ నెరవేర్చలేదని విమర్శించారు.సన్న రకాల వరికి బోనస్ ప్రకటించిన ప్రభుత్వం అమలులో విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి యాభై రోజులు దాటినా ఇప్పటివరకు రైతులకు బోనస్ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ప్రభుత్వ తీరు మాటలకు చేతలకు పొంతన లేకుండా మారిందని మండిపడ్డారు.యూరియా ఎరువుల పంపిణీకి యాప్ విధానాన్ని ప్రవేశపెట్టడం రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతుందన్నారు. ఇప్పటికే షాపుల్లో యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతుంటే, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు యాప్ ద్వారా ఎలా యూరియా పొందగలరని ప్రశ్నించారు. ఇతర మండలాలకు వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వస్తే అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల పంట సమస్యలు, చీడపీడలు, సస్యరక్షణ, ఎరువులు–మందుల వినియోగంపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి రైతులకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, రైతు సంఘం మాజీ మండల అధ్యక్షుడు అంబటి సురేందర్ రెడ్డి, కూనూరు వెంకటేశం, దాడి మల్లారెడ్డి, దాడి శుభాష్ రెడ్డి, బల్గురి ఉపేందర్, కూనూరు మల్లేశం, కందుల మధుసూదన్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యాసంగిలో రైతుకు భరోసా లేదు. షాపుల్లో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News