Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:53 PM

యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం

29-01-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

రూ.22 లక్షల విలువైన బంగారం–వెండి డాలర్లు మాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మరోసారి ఇంటి దొంగల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆలయ ప్రచార శాఖ ద్వారా విక్రయించే బంగారం, వెండి డాలర్లు భారీగా మాయమైనట్టు అధికారులు ఆడిట్‌లో ధృవీకరించారు. ఈ ఘటనలో సుమారు రూ.22 లక్షల విలువైన ఆలయ డాలర్లు గల్లంతైనట్టు తేలింది.

ఇటీవల నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చేతివాటమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. డాలర్ల నిల్వలు, విక్రయ లెక్కల్లో తీవ్ర వ్యత్యాసాలు బయటపడటంతో విచారణకు ఆదేశించారు.

ఇది తొలిసారి కాదు. గతంలోనూ ప్రసాదాల తయారీ కేంద్రంలో చింతపండు ఎత్తుకెళ్లిన ఘటన, అలాగే ప్రసాదాల అమ్మకాలలో అవకతవకలకు పాల్పడిన సిబ్బంది వ్యవహారాలు ఆలయ ప్రతిష్ఠకు మచ్చతెచ్చాయి. అయినా సరే, ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

నిత్యం చిన్నచిన్న చేతివాటాలతో ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న ఇంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల విరాళాలతో నడిచే ప్రముఖ ఆలయంలో భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈసారి అయినా చర్యలు కనిపిస్తాయా? అన్న ప్రశ్న భక్తుల్లో మిగిలిపోయింది.

Sthanikam

యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News