Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:44 PM

వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

13-01-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ని పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన వసతులు, పంటల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పనపై చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ మార్కెట్ ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు అందేలా కృషి చేస్తామని కొప్పుల వేణారెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. గాజుల మల్కాపురం గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News