Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:37 AM

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

12-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ:

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువత ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి ముందుకు సాగాలని, దేశభక్తిని జీవిత విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.వివేకానంద బోధనలను ఆచరణలో పెట్టేందుకు డివైఎఫ్ఐ యువతను చైతన్యం చేస్తూ గంజాయి, డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉండేలా అవగాహన సదస్సులు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సేవా భావంతో పనిచేయాలని, త్యాగం, సేవా గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద మాటలను ఆచరించి సన్మార్గంలో ప్రయాణించినప్పుడే సమాజానికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, నాయకులు కత్తుల లింగస్వామి, నాతి నరేష్, వేణు, రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News