Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 04:23 AM

విశాఖ భూ దోపిడీపై వైఎస్సార్‌సీపీ సమరభేరి: గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన దీక్ష.

30-01-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విశాఖపట్నం: గీతం యూనివర్సిటీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కట్టబెట్టాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖలో భారీ నిరసన చేపట్టింది. జీవీఎంసీ (GVMC) గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ నిరసన దీక్షను శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పూలమాలలు వేసి అధికారికంగా ప్రారంభించారు..

ఈ నిరసన దీక్షలో విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మరియు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, ధర్మశ్రీ, పసుపులేటి బాలరాజు మరియు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ మేయర్ హరి వెంకట్ కుమారి, కార్పొరేటర్లు, పాల్గొన్నారు.

అడ్డగోలు క్రమబద్ధీకరణ: సుమారు ₹5,000 కోట్ల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థకు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కౌన్సిల్ సమావేశంపై నిఘా: నేడు జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ భూ కేటాయింపులను అడ్డదారిలో ఆమోదించే ప్రక్రియను పార్టీ పరంగా తీవ్రంగా అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది.

ఎంపీ అరెస్టుకు డిమాండ్: భూకబ్జాకు పాల్పడిన ఎంపీ ఎం.శ్రీభరత్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులు రద్దు చేసే వరకు మరియు విశాఖ భూములకు రక్షణ కల్పించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపబోదని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సి.ఇ.సి సభ్యులు,ఎస్.ఇ.సి సభ్యులు,రాష్ట్ర పార్టీ కమిటి అధికార ప్రతినిధిలు, సంయుక్త కార్యదర్శులు,రాష్ట్ర పార్టీ అనుబందం విభాగలు అధ్యక్షులు,కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జడ్పిటిసిలు,ఎంపీటీసీలు, అనుబందం విభాగాల జిల్లా, నియోజకవర్గం, మండలం మరియు వార్డుల అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

విశాఖ భూ దోపిడీపై వైఎస్సార్‌సీపీ సమరభేరి: గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన దీక్ష.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News