Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:25 PM

విజయనగరంపై ఖాదర్ బాబా ఆశీస్సులు నిలవాలి: కోలగట్ల వీరభద్రస్వామి

29-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
విజయనగరం స్థానికం ప్రధాన ప్రతినిధి

విజయనగర ప్రజలపై హుజూర్ హజరత్ బాబా ఖాదర్ అవులియా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షించారు. గురువారం బాబామెట్టలో నిర్వహించిన ఖాదర్ బాబా అవులియా 67వ ఉరుసు మహోత్సవాలకు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు.కోలగట్ల వీరభద్రస్వామి రాక సందర్భంగా దర్గా యాజమాన్యం మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ వేషధారణలతో ఘన స్వాగతం పలికింది. అనంతరం బాబా చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి విజయనగర ప్రజలపై బాబా ఆశీస్సులు నిలవాలని ప్రార్థించారు. అలాగే పార్టీ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనను సత్కరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఖాదర్ బాబా దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని కోలగట్ల పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దర్గాను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. కుల, మత భేదాలు లేకుండా సమానత్వాన్ని చాటే వేదికగా ఖాదర్ బాబా దర్గా విరాజిల్లుతోందని అన్నారు. మూడు రోజుల ఉరుసు మహోత్సవాలకే పరిమితం కాకుండా నిత్య అన్నదానం నిర్వహిస్తున్న దర్గా యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం రెడ్డి బంగారు నాయుడు, ఫ్లోర్ లీడర్ ఎస్.వి.వి. రాజేష్, నియోజకవర్గ యువజన–విద్యార్థి విభాగాల ఇంచార్జ్ కౌశిక్ ఈశ్వర్, స్థానిక కార్పొరేటర్లు, యువజన విభాగ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

విజయనగరంపై ఖాదర్ బాబా ఆశీస్సులు నిలవాలి: కోలగట్ల వీరభద్రస్వామి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News