Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:40 AM

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

31-01-2026 536 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ 06వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిర్రబోయిన రమేష్, భగవాన్ దాస్, యల్లయ్య, జక్కల నర్సింహ, చిర్రబోయిన నర్సింహ, అంజయ్య, మెండే నర్సింహ, లింగస్వామి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్నే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రానున్న చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల మధ్య ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఇంటికీ కాంగ్రెస్ పాలన ఫలాలు చేరేలా పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.

Sthanikam

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News