Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

వెల్లంకిలో జాతీయ స్పూర్తికి అద్దం పట్టిన గణతంత్ర వేడుకలు

26-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలతో జాతీయ భావోద్వేగాలకు అద్దం పట్టింది. గ్రామపంచాయతీ భవనం ఎదుట గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.గ్రామంలో దేశభక్తి నినాదాలతో వాతావరణం మార్మోగగా, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నూతన వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు ఘనత చేకూర్చారు.

గణతంత్ర దినోత్సవాన్ని విద్యాభివృద్ధితో ముడిపెడుతూ గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆన్‌లైన్ విద్యకు సహకారంగా బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎడ్ల నరేందర్ రెడ్డి ముప్పై వేల రూపాయల విలువైన టీవీని విరాళంగా అందించారు. ఈ టీవీని గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sthanikam

వెల్లంకిలో జాతీయ స్పూర్తికి అద్దం పట్టిన గణతంత్ర వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News