స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ వాసులు మంగళవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి తమ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
కాలనీలో ఇంకా పెండింగ్‌లో ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులు, రోడ్ నంబర్–7లో డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు, తాగునీటి పైప్‌లైన్ సమస్యతో పాటు కాలనీ అమ్మవారి ఆలయం ముందు వర్షాకాలంలో తరచూ ఏర్పడుతున్న నీరు నిలిచిపోవడం (వాటర్ లాగింగ్) సమస్యలపై కాలనీ వాసులు వివరించారు.
ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, పేర్కొన్న పనులను అత్యవసరంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాలనీ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు యాదవ రెడ్డితో పాటు పలువురు కాలనీ నివాసితులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి