Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

వీబీజీరామ్‌జీ చట్టంతో కూలీలకు నష్టం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు.

19-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తున్నారు.

: గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు విమర్శించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం మూడవ మహాసభలు మంగళవారం రామన్నపేటలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఒళ్ళు యాదగిరి జెండా ఆవిష్కరణ చేసి మహాసభలను ప్రారంభించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టానికి సరిపడా నిధులు కేటాయించకుండా పని దినాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. కేంద్రం తీసుకురానున్న వీబీజీరామ్‌జీ చట్టం అమల్లోకి వస్తే ఉపాధి కూలీల హక్కులు మరింత క్షీణించే ప్రమాదం ఉందన్నారు.

కాంట్రాక్టర్ల పెత్తనం, యంత్రాల వినియోగం పెరిగి గ్రామీణ నిరుద్యోగం అధికమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకునేందుకు వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలకు సంఘీభావంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడి సౌహర్థ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు గొరిగే సోములు, బొడ్డుపల్లి వెంకటేశం, వ్యకాస మండల అధ్యక్ష, కార్యదర్శులు మేడి ముకుంద,కందుల హనుమంతు,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గంటెపాక శివ కుమార్,ఈర్లపల్లి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వీబీజీరామ్‌జీ చట్టంతో కూలీలకు నష్టం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News