చీమల కొండూరు స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు ఆదేశాల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మంగళవారం చీమలకొండూరులోని బెజ్జాల లక్ష్మయ్య ఫౌండేషన్ వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వయోవృద్ధులతో ముఖాముఖి నిర్వహించి, వారికి అందుతున్న వసతులు, సౌకర్యాలపై సమీక్షించారు. వయోవృద్ధులకు అవసరమైన న్యాయ సహాయం ఉందా? అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు.వయోవృద్ధులు ఒంటరి వారు కాదని, వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం వారికి హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. ఆశ్రమాల్లో ఉన్న తల్లిదండ్రులను వారి కుమారులు, కుమార్తెలు సందర్శించి అవసరాలను తీర్చాలని, మానవత్వ బాధ్యత పెరిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి