Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి

20-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: రాష్ట్ర వారసత్వ, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారసత్వ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని పానగల్లు మ్యూజియంలో సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పర్యాటకులు, విద్యార్థులు, చరిత్రాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు. సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మ్యూజియం సిబ్బంది ఎండీ గౌస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వారసత్వ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వారసత్వ శాఖ సంచాలకులు అర్జున్ రావు, అదనపు సంచాలకులు నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, యువత, పర్యాటకులు, చరిత్రాభిమానులు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

వారోత్సవాల షెడ్యూల్

మే 20 : హెరిటేజ్ వాక్

మే 21 : హెరిటేజ్ వాక్‌, ప్రత్యేక కార్యక్రమాలు, పోస్టల్ కవర్ ఆవిష్కరణ

మే 22 : ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం

మే 23 : ముగింపు వేడుకలు

వారసత్వ సంపదను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో చారిత్రక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News