Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:14 AM

వనస్థలిపురం డివిజన్‌లో డ్రైనేజీ మౌలిక వసతుల బలోపేతం

10-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సద్గురు నగర్‌లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగు

వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని సద్గురు నగర్ కాలనీలో డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సద్గురు నగర్ కాలనీలో ఏళ్లుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పైప్‌లైన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని, కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో కర్మాన్‌ఘాట్ దేవాలయం డైరెక్టర్ కవిత, వర్క్ ఇన్‌స్పెక్టర్ సతీష్ రెడ్డి, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. అలాగే సద్గురు నగర్ కాలనీ అధ్యక్షుడు సంజీవయ్య, జనరల్ సెక్రటరీ రామారావు, ఉమాపతి, నవీన్, వంశీతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

డ్రైనేజీ పనులు పూర్తయితే కాలనీలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయని, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

వనస్థలిపురం డివిజన్‌లో డ్రైనేజీ మౌలిక వసతుల బలోపేతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News