Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:33 PM

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం
28-01-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్‌పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి:

నార్కట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగియగా, గెలుపొందిన జట్లకు రేపు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పట్టణ వాలీబాల్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా మొదటి బహుమతిగా పది వేల రూపాయలను జింకల ఆనంద్ యశోద గార్లు అందజేయనుండగా, రెండో బహుమతిగా ఐదు వేల రూపాయలను పుల్లెంల మహేశ్ గౌడ, మేఘన గార్లు ప్రదానం చేయనున్నారు.

టోర్నమెంట్‌లో నార్కట్‌పల్లి బీసీ కాలనీ జట్టు ప్రథమ బహుమతిని సాధించి విజేతగా నిలవగా, ఎల్లారెడ్డిగూడెం జట్టు ద్వితీయ బహుమతితో సరిపెట్టుకుంది. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉండనున్నదని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News