Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ సోదాల వేళ.. అధికారుల గైర్హాజరు! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 01:21 PM

విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

13-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ముఖ్యమంత్రికి సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బహిరంగ లేఖ..

న్యాయమైన డిమాండ్ల కోసం ఐదు రోజులుగా కొనసాగుతున్న సమ్మె..

​నల్గొండ : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో దశాబ్దాలుగా వెలుగులు నింపుతున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గత ఐదు రోజులుగా (ఏప్రిల్ 08 నుంచి) నిరవధిక సమ్మె బాట పట్టిన కార్మికులకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సోమవారం ఒక బహిరంగ లేఖ రాస్తూ.. 20 వేల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్చలు జరపాలని కోరారు. గత ప్రభుత్వం 2017లో కార్మికులను రెగ్యులర్ చేస్తామని నమ్మబలికి తీరా సమయం వచ్చేసరికి పదోన్నతులు, సెలవులు ఇవ్వకుండా వంచించిందని ఆయన విమర్శించారు. సంస్థలోని సాధారణ ఉద్యోగులకు వర్తించే 'APSEB' నిబంధనలను కాదని ఆర్టిజన్ల కోసం ప్రత్యేకంగా 2020లో నిరంకుశంగా కొత్త సర్వీసు రూల్స్ తేవడం అన్యాయమని పేర్కొన్నారు. కనీసం త్రాగునీరు, వెలుతురు వంటి కనీస సదుపాయాలు లేని సబ్‌స్టేషన్లలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికుల ప్రధాన డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. విద్యార్హత కలిగిన ప్రతి ఆర్టిజన్ కార్మికుడిని జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ లేదా సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని అన్‌మ్యాన్డ్ వర్కర్లను, 2016 నుంచి చిన్నపాటి సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్న కార్మికులను తక్షణమే సంస్థలో విలీనం చేయాలని కోరారు. బిల్ రీడర్లు, కలెక్టర్లు, హమాలీలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంతో పాటు, అందరికీ వర్తించేలా 'పీఆర్సీ-2026'ను ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.​ సమ్మె సుదీర్ఘంగా కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పరిస్థితి మరింత జటిలం కాకముందే ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News