Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:18 PM

వైభవంగా హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి ఉర్సు ఉత్సవాలు

13-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కులమతాలకు అతీతంగా తరలిరానున్న భక్తులు

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. స్థానిక జాతీయ రహదారి (NH 65) పక్కనే కొలువై ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం (14-04-2026) నుండి బుధవారం (15-04-2026) వరకు రెండు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. దర్గా ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధం మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు, ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ దర్గా అత్యంత మహత్యంగలదిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం విశేషం. ఈ ఉర్సు మహోత్సవానికి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, బాబా వారి కృపకు పాత్రులు కావాలని దర్గా ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.

Sthanikam

వైభవంగా హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి ఉర్సు ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News