Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ

Updated : 04 Jan 2026 15:44 IST
As Preferred Source 1 min read
వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :సమాజ హితాన్ని లక్ష్యంగా చేసుకుని వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అవసరాలున్న విద్యార్థులకు స్వెటర్లను పంపిణీ చేశారు. ఆదివారం నాడు కామ్జీపూర్ తాండా, కేజీబీవీపీ, బాల సదనంలోని విద్యార్థులకు ఈ స్వెటర్లు అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు బాలప్రసాద్,కృష్ణ ప్రసాద్, సావిత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నారాయణఖేడ్ ప్రాంతంలో గత మూడు సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యకర్తలు చంద్రశేఖర్ ఆచార్య, అమర్, రవీందర్, అభిషేక్‌తో పాటు కాంజిపూర్, కేజీబీవీపీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :సమాజ హితాన్ని లక్ష్యంగా చేసుకుని వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అవసరాలున్న విద్యార్థులకు స్వెటర్లను పంపిణీ చేశారు. ఆదివారం నాడు కామ్జీపూర్ తాండా, కేజీబీవీపీ, బాల సదనంలోని విద్యార్థులకు ఈ స్వెటర్లు అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు బాలప్రసాద్,కృష్ణ ప్రసాద్, సావిత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నారాయణఖేడ్ ప్రాంతంలో గత మూడు సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యకర్తలు చంద్రశేఖర్ ఆచార్య, అమర్, రవీందర్, అభిషేక్‌తో పాటు కాంజిపూర్, కేజీబీవీపీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి